Telangana : విద్యార్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2025-09-26 04:57 GMT

తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం తన హృదయాన్ని తాకిందన్నారు.

వచ్చే ఏడాది నుంచి...
అందుకే వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్నాదురై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధులకు జన్మనిచ్చిన తమిళనాడు అని, వారి విజన్ అద్భుతమని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఇందిరాగాంధీ కూడా కామరాజ్ ప్లాన్ తీసుకు వచ్చారన్నారు. తమిళనాడు విధానంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. తమిళనాడులో కొనసాగుతున్న విద్యావిధానం మిగిలిన రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు.


Tags:    

Similar News