భూదాన్ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్

రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు

Update: 2025-08-25 06:41 GMT

రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో దాదాపు 250 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వెంటనే ఈ భూదాన్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపించాలని కోరారు.

నివేదిక ఇవ్వాలంటూ...
విచారణ జరిపిన వెంటనే తనకు ఈ ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూదాన్ భూములను ఆక్రమించుకోవడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే యాచారంలోని భూ ఆక్రమణలపై విచారణను ప్రారంభించారు.


Tags:    

Similar News