KTR : నేడు వరంగల్ లో కేటీఆర్ కీలక భేటీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2024-05-22 04:23 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లో జరిగే ములుగు జిల్లా కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత మధ్యాహ్నం వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతారు.

వరస సమావేశాలతో...
సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై ఈ ఎన్నికల్లో గెలుపుకోసం ఏం చేయాలన్న దానిపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనుండటంతో కేటీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ కు మళ్లీ ఊపిరి పోయాలని ఆయన భావిస్తున్నారు.


Tags:    

Similar News