KTR : చర్చకు రాలేదేంటి.. చేసిన తప్పులు ఒప్పుకున్నట్లేనా?

రాష్ట్రంలో రైతు సంక్షేమంపై చర్చిద్దామంటే రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

Update: 2025-07-08 06:44 GMT

రాష్ట్రంలో రైతు సంక్షేమంపై చర్చిద్దామంటే రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరిన కేటీఆర్ అక్కడకు వచ్చి కాంగ్రెస్ నేతలు రాకపోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వమిది అని కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు.

అభివృద్ధిపై చర్చకు రావాలని...
అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరించి ఇక్కడకు వస్తే ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధమేనని, అక్కడ తమకు మైకు ఇవ్వరని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి మూటలు మోస్తూ రేవంత్ రెడ్డి తన పదవులను కాపాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాసమస్యలను గాలికి వదిలి ఢిల్లీకి తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.


Tags:    

Similar News