KTR : జైలుకు వెళ్లడానికి సిద్ధమే
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇటువంటి విచారణలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
KTR
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇటువంటి విచారణలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను పిరికి పందను కానని, తాను విచారణకు వెళ్తానని అన్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణకు ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు ముందు ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని, తాను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని తెలిపారు.
భయపడేది లేదు...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో భాగంగా తాను జైలుకు వెళ్లడానికి కూడా భయపడబోనని తెలిపారు. విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నందునే పక్క దోవపట్టించేందుకు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలా టీఆర్ఎస్ ఉంటుందని ఆయన అన్నారు. ఎన్ని దొంగ కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్నారు కేటీఆర్.