KTR : పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై కేటీఆర్ ఏమన్నారంటే?

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2025-06-21 04:17 GMT

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి ఈ అరెస్ట్ నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తున్నారని, కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా...
బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ తెలిపారు. అరెస్ట్ లతో తమ గొంతులు నొక్కలేరన్న విషయం తెలుసుకోవాలని కోరారు. కాగా శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని వరంగల్ కు తరలించారు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


Tags:    

Similar News