BRS : పార్టీలోకి ఎంట్రీయే అవకాశం లేదట.. కేటీఆర్ కీలక నిర్ణయం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇక పార్టీలోకి అనుమతించే ప్రసక్తి లేదని చెబుతున్నారు

Update: 2025-07-31 12:29 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇక పార్టీలోకి అనుమతించే ప్రసక్తి లేదని చెబుతున్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను ఇక మళ్లీ తిరిగి వచ్చినా తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ పై తీర్పు వెలువడి మూడు నెలల్లో తేల్చలాని స్పీకర్ ను ఆదేశించడంతో ఉప ఎన్నికలు వస్తాయని నమ్ముతున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా, 2028లో జరిగే ఎన్నికల్లోనైనా ఈ పది మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మొత్తం పది మంది చేరడంతో వారిపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాల్సి ుంద.ి

పార్టీ మారిన ఎమ్మెల్యేలు...
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు పార్టీ మారిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెబుతున్నారు.
కొందరు సంకేతాలు పంపడంతో...
అయితే పది మంది ఎమ్మెల్యేలల్లో కొందరు తిరిగి బీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈమేరకు మధ్యవర్తుల ద్వారా సంకేతాలు పంపించారట. బీఆర్ఎస్ లోనే తమకు గెలుపు కానీ, రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించిన పార్టీ నేతలు తిరిగి కారు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కేసీఆర్ అంగీకరించినా కేటీఆర్ మాత్రం వారి తిరిగి చేరికకు అంగీకరించడం లేదు. మరొకవైపు మొహమాటంగా లేకుండా కేటీఆర్ మొహం మీదనే చెప్పేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వదిలి పెట్టి వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకునేది లేదని, ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Tags:    

Similar News