రేవంత్ రెడ్డి కేటీఆర్ మరోసారి సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు రావాలని మరోసారి ఛాలెంజ్ విసిరారు. చర్చకు పిలిస్తేపారిపోతాడు పిరికోడు అని... రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బ్యారేజీపైనే చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
కూలేశ్వరం అంటూ...
ప్రతిసారీ కూలేశ్వరం అంటూ వెటకారం చేయడం మానుకుని చర్చకు సిద్ధమవ్వాలని, తాను వచ్చినా చర్చకు వచ్చేధైర్యం మాత్రం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. దమ్ముంటే తాను విసిరిన సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డపై చర్చిద్దామని, ఎక్కడైనా ప్లేస్ నువ్వే చెప్పంటూ మరోసారి కేటీఆర్ సవాల్ విసిరారు.