BRS : నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడు జరగనుంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో నేడు సభ జరగనుంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడు జరగనుంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో నేడు సభ జరగనుంది. ఈ సభకోసం భారీ ఏర్పాట్లను చేశారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే చేరుకున్నారు. నిన్నటి నుంచే ఎల్కతుర్తికి చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు.
వరంగల్ కు క్యూ కడుతున్న జనం...
బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా పార్టీ అగ్రనేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే వారి కోసం మంచినీరు, మజ్జిగ, ఆహారాన్ని అందించేందుకు ఎక్కడక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు సభకు రానుండంతో ఆయన ఏం మాట్లాడాతరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.