నేడు కరీంనగర్ జిల్లాకు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పెద్దపల్లిలో ఆమె పర్యటన కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్ కు చేరుకుని అక్కడ ఒక దుకాణాన్ని ప్రారంభించనున్న కవిత అనంతరం పెద్దపల్లికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దపల్లి చేరుకున్న వెంటనే తెలంగాణ తల్లికి పూలమాల వేస్తారు.
పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో...
అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో టీబీజేకేఎస్ కార్యకర్తలతో కవిత సమావేశమవుతారు. పెద్దపల్లిలో కవిత పర్యటన సందర్భంగా పెద్దయెత్తున కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.