Kalvakuntla Kavita : కేంద్రాన్ని నిలదీసిన కల్వకుంట్ల కవిత

జనగణనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని నిలదీశారు.

Update: 2025-02-02 07:23 GMT

జనగణనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని నిలదీశారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారు ? అని ఆమె ప్రశ్నించారు. జనగణనను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుంది ? అని కల్వకుంట్ల కవిత నిలదీశారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.

జనాభా లెక్కలు లేకుండా...
జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందన్న కల్వకుంట్ల కవిత ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని అన్నారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే దేశ ప్రగతి సాధ్యం కాదని ఆమె తెలిపారు. అభివృద్ధి కూడా సమానంగా జరగదని కల్వకుంట్ల కవిత అన్నారు.


Tags:    

Similar News