Kalvakuntla Kavitha : పింక్ బుక్ రెడీ అవుతుంది.. కవిత మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యాలు చేశారు. పింక్ బుక్ ను తాము రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు

Update: 2025-02-28 07:51 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యాలు చేశారు. పింక్ బుక్ ను తాము రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానంటూ కవిత వార్నింగ్ ఇచ్చారు కచ్చితంగా పింక్ బుక్ ను మెయిన్ టెయిన్ చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము కూడా చూస్తూ ఊరుకోబమని కవిత వార్నింగ్ ఇచ్చారు.

ఎంత పెద్దవారినైనా...
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమని, అధికారంలోకి రాగానే పింక్ బుక్ ను అమలు చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటామని కవిత తెలిపారు. తకు కూడా టైం వస్తుందని, అప్పుడు అందరి సంగతి చెప్తా మంటూ కవిత హెచ్చరించారు.


Tags:    

Similar News