Kalavakuntla Kavitha : మరోసారి బీఆర్ఎస్ నేతలపై కవిత హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-07-17 05:42 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇవ్వడం సరైనదేనని కవిత అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో కవిత మాట్లాడారు. తాను నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదేనని, అందుకే తాను మద్దతిచ్చానని, బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ ను తప్పుపట్టడం సరికాదని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్ పై...
బీసీ రిజర్వేషన్ పై బీఆర్ఎస్ నేతలు తీసుకున్న స్టాండ్ కరెక్ట్ కాదని, ఎప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తన దారిలోకి రావాల్సిందేనని అన్నారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. బనకచర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం తప్పించి ప్రజాప్రయోజనాల కోసం కాదని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బనకచర్లపై చర్చ జరగడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ అనడం సరికాదన్నారు.


Tags:    

Similar News