Breaking : ప్రియాంక గాంధీని పిలిస్తే ఊరుకోం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు

Update: 2024-02-03 05:48 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తమ పార్టీ నేతలను పిలిస్తే తాము నిరసన తెలియజేస్తామన్నారు. ఐదు వందలకే మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నిన్న ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ని ఆహ్వానిస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును ప్రయివేటు కార్యక్రమాలకు పెట్టడమేంటని ఆమె నిలదీశారు. నిన్న ఇంద్రవెల్లి సభలో నిర్వహించిన సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్టీ ప్రచారం కోసం..
పార్టీ ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించడమేంటని నిలదీశారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి వంద రోజుల వరకూ ఓపిక పడతామని చెప్పారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామని తెలిపారు. రేవంత్ రెడ్డిని ప్రజలు యూటర్న్ ముఖ్యమంత్రిగా పిలుస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలను వివరిస్తామని చెప్పారు. రెండు నెలల్లో ముఖ్యమంత్రి ప్రజలను ఒక్కరోజు మాత్రమే కలిశారని, మరి కేసీఆర్ ను విమర్శించడం దేనికి అని ఆమె ప్రశ్నించారు. కుటుంబం అంటూ తమ మీద పడే కంటే కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కుటుంబాలకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలంటూ జాబితాను చదివి వినిపించారు.


Tags:    

Similar News