BRS : రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం రేపు జరగనుంది.

Update: 2025-03-10 04:28 GMT

బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం రేపు జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

బడ్జెట్ సమావేశాలపై...
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కానుందని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవ్వాలని కోరారు. బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిధులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు లబ్దిదారుల ఎంపిక వంటి అంశాలపై అధికార పక్షాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేయనున్నారు.


Tags:    

Similar News