BRS : ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థితో బీఆర్ఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను గెలుచుకుంది. ఇంద్రేశం మున్సిపల్ ఛైర్మన్ గా ప్రమీల, వైస్ ఛైర్మన్ గా హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ కు మద్దతివ్వడంతో ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో...
మరొకవైపు పటాన్ చెరు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ మద్దతు దారుగా ఉన్నారు. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యను కాదని అక్కడి ఓటర్లు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుని ఇక్కడ షాకిచ్చినట్లయింది.