నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష
నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష నిర్వహించనుంది
నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష నిర్వహించనుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన భేటీ జరగనుంది. సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు హాజరుకానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందకపోవడంపై పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎక్కడ లోపం జరిగిందన్న దానిపై జిల్లా అధ్యక్షులతో రామ్ చందర్ రావు చర్చించనున్నారు.
మెరుగైన ఫలితాలు రాకపోవడంతో...
మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీ అభ్యర్థులు గెలవకపోయినా, గతంలో కంటే ఎక్కువ వార్డులు గెలుచుకున్నామని, అలాగే కొత్త జిల్లాల్లోనూ మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారని, అయితే పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈ సమావేశంలో జరిగిన లోటుపాట్లపై బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు నేతలతో చర్చించనున్నారు.