కరీంనగర్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేసింది
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేసింది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేరును ప్రతిపాదించింది. కరీంనగర్ మేయర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లుండగా అందులో 30 డివిజన్లలో బీజేపీ విజయం సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పథ్నాలుగు డివిజన్లకే పరిమితమయింది.
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు...
దీంతో మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించడం, ఎక్స్ అఫిషియో ఓట్లతో బీజేపీ మేయర్ పదవిని గెలుచుకునేందుకు మార్గం సుగమమయింది. అందుకే కరీంనగర్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ కౌన్సిల్ సమావేశానికి హాజరయింది. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని తెలిసింది.