కాంగ్రెస్ లో కవిత అవసరం ఏముంది?
కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు
కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ నాటకానికి కవిత వ్యాఖ్యలు నిదర్శనమని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కవితను బయటపడేయడానికి బీజేపీ వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ తాకట్టుపెట్టిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా...
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటానికి కారణం కవిత వ్యాఖ్యలతో క్లియర్ అయిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సొమ్మును దోచుకున్న దెయ్యాలను కవిత బయటపెట్టాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బండారం బట్టబయలయిందని చామల అన్నారు.