Telangana : సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిశ్చయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించారు. బీసీ నేతలు, మంత్రులతో కూడా సమావేశమయ్యారు.
బీసీ రిజర్వేషన్ల స్టే పై...
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోవడంతో ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తమ వాదనలను వినిపించాలని డిసైడ్ చేసింది. సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనుంది.