Telangana : 11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

తెలంగాణ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది

Update: 2025-12-11 07:02 GMT

తెలంగాణ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 61 శాతం పోలింగ్ జరిగింది. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 40 శాతం ఓటింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. ఒంటి గంటకు పోలింగ్ ముగియనుండటంతో పెద్దయెత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.

సాయంత్రానికి ఫలితాలు...
మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు భారీ భద్రత కల్పించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు మొహరించారు. ఈ రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఈరోజు మధ్యాహ్నానికి కౌంటిగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు.


Tags:    

Similar News