Telangana : ముగిసిన పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.
తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుంది. అయితే ఒంటిగంట వరకూ క్యూ లైన్ లో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పిస్తారు. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
చాలా మంది క్యూలైన్ లోనే...
3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యులకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం రెండు గంటలకు పోస్టల్ బ్యాలెట్ లను కౌంటింగ్ ను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు 75 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. బ్యాలట్ పద్ధతిలో ఓటింగ్ జరగడంతో లెక్కింపు ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నిక తర్వాత వైస్ ఛైర్మన్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు.