ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరు నెలల నుంచి విచారణ చేస్తున్నప్పటికీ ఎవరిపై చర్యలు లేవని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారని, సిట్ ఏం చేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరునెలలున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. విచారణలో సిట్ ఏం సాధించిందని అన్నారు.
చర్యలు తీసుకోవడంతో...
ట్యాపింగ్ కు భయపడి హరీశ్ రావు ఒక ఏడాది ఫోన్ వాడలేదని, ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకుండా ఈ నాన్చుడు ఏంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని అన్నారు. కేసీఆర్ హయాంలో బచ్చాగాళ్లు కూడా వాట్సాప్ కాల్ తో మాట్లాడాల్సిన పరిస్థితులున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి ప్రభాకర్ రావు పై ఇంత వరకూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.