Mahabubnagar : వీధి కుక్కల దాడి.. 25 మందికి పైగా గాయాలు
పాలమూరు జిల్లాలో వీధికుక్కల దాడికి ఇరవై ఐదు మంది వరకూ గాయపడ్డారు.
పాలమూరు జిల్లాలో వీధికుక్కల దాడికి ఇరవై మంది వరకూ గాయపడ్డారు. ఒకే రోజు ఇంత మంది గాయపడటంతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే కుక్కలదాడిలో గాయపడిన వారంతా చిన్నారులే కావడంతో వారికి చికిత్సను అందించేందుకు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గోల్ మజిద్, హనుమాన్ పుర, పాలమూరు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడికి అనేక మంది దాడులకు గురికావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఐదుగురికి తీవ్ర గాయాలు...
అయితే కుక్కల దాడిలో గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కుక్కల దాడిలో గాయపడిన ఇరవై ఐదు మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. వారిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వీధికుక్కల స్వైర విహారం జరుగుతుందని, వారి అలక్ష్యం కారణంగానే ఇంతమంది గాయపడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు.