రేవంత్ పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై వేసిన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టులో నేడు వాదనలు జరిగాయి

Update: 2022-12-19 06:35 GMT

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై వేసిన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టులో నేడు వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ ను ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ అనుమతించిందని పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఏ శాఖపై అభ్యంతరాలున్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటీషన్ వేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ కేసును ముగిస్తూ మరో పిటీషన్ ను వేసుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది.

మరో కేసు వేసుకోవాలని...
బంగారు కూలి పేరుతో చేసిన నిధుల సమీకరణపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబరు 6వ తేదీలో పు బీఆర్ఎస్ పై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘాలనికి ఫిర్యాదు చేయాలని చెప్పిందని, తాను చేసిన అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఐటీ శాఖ కు సంబంధించిన కేసు కూడా పెండింగ్ లో ఉందని, ఇది పూర్తికాకుండానే బీఆర్ఎస్ పేరు మార్పుపై రేవంత్ తన పిటీషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News