Telangana : సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం
సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు సమాచారం
సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు సమాచారం. ఆసుపత్రి భవనంలో పనిచేస్తుండగా సెంట్రింగ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఐదుగురు కార్మికులకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈఎస్ఐ హాస్పిటల్ లో బిల్డింగ్ రెనోవేషన్ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో...
భవనం స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ వార్డు లో రెనోవేషన్ పనులు కార్మికులు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సంగతి తెలిసిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సెంట్రింగ్ ఊడి పడటంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.