Telangana : తెలంగాణలో ఒంటిపూడ బడులు ఎప్పటి నుంచి అంటే

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది.

Update: 2026-02-18 04:22 GMT

ఎండలు తీవ్రమవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16 నుంచి ఒంటిపూట బడులునిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.

పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో...
పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ ఏడాది వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉంటాయి. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నుంది.


Tags:    

Similar News