Breaking : కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ

గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది.

Update: 2026-02-13 06:05 GMT

గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏ .ఐ.ఎఫ్.బి సొంతం చేసుకుంది. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జాగృతి తరుపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేశారు. మొత్తం పది వార్డులుండగా ఎనిమిది స్థానాల్లో ఏ .ఐ.ఎఫ్.బి అభ్యర్థులు గెలిచి తమ సత్తాను చాటారు.

మిగిలన చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ లు గెలిచాయి.
ముందుగానే కవిత తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేస్తారని ప్రకటించారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో కవిత పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవగా, కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. దీంతో కవిత బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను సాధించి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.


Tags:    

Similar News