జడ్చర్ల తప్పిన ఘోర ప్రమాదం.. ప్రయివేటు బస్సు మళ్లీ
జడ్చర్ల మండలం మచారం దగ్గర ఎన్‌హెచ్–44పై పెద్ద ప్రమాదం తప్పింది.
జడ్చర్ల మండలం మచారం దగ్గర ఎన్‌హెచ్–44పై పెద్ద ప్రమాదం తప్పింది. జగన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఒక యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ట్యాంకర్‌లో ఉన్న రసాయనాల వల్ల దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించింది. పరిస్థితి విషమించే సమయంలోనే బస్సులో ఉన్న ప్రయాణికులు ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు.
యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో...
అందరూ సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణనష్టం గానీ గాయాలు గానీ జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ట్యాంకర్‌లోని హైడ్రోఫ్లురిక్ యాసిడ్ ను జాగ్రత్తగా ఖాళీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాలను పూర్తిగా భద్రపరిచే పనులు కొనసాగుతున్నాయి.