KTR : నేడు కేటీఆర్ సుడిగాలి పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

Update: 2026-02-09 04:26 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం ఆయన పరకాల, మహబూబాబాద్ పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటున్నారు. కేటీఆర్ పాల్గొంటున్న సభలకు నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో నేడు తెలంగాణలో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. వరసగా మూడు సభల్లో ఆయన పాల్గొంటారు.


Tags:    

Similar News