Telangana : లిక్కర్.. ఆల్ టైమ్ రికార్డ్ సేల్స్
గత ఏడాది చివరి నెలలో మద్యం షాపులకు కిక్కు లభించింది
గత ఏడాది చివరి నెలలో మద్యం షాపులకు కిక్కు లభించింది. ఒక్క డిసెంబరు నెలలోనే డిసెంబరు నెలలో 5,050 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి ఒక్కరోజు తెలంగాణ వ్యాప్తంగా 350 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని చెబుతున్నారు.
పంచాయతీ ఎన్నికలు...
2023లో 4,200 కోట్లు జరిగాయని, 2025 లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తెలంగాణలో గత ఏడాది మద్యం విక్రయాలు పెరగడానికి పంచాయతీ ఎన్నికలు కూడా కారణమని చెబుతున్నారు. కొత్తగా షాపులు దక్కించుకున్న వారు తొలి నెలలోనే అదిరిపోయే అమ్మకాలు జరిపి లాభాలను ఆర్జించారు.