Hyderabad : టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి సెలవుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - విజయవాడ మధ్య టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వాలని ఆయన తాను రాసిన లేఖలో కోరారు. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ఏటా ఈ మార్గంలో లక్షలాది వాహనాలు వెళతాయని, టోల్ గేట్ల వద్ద ఆగడం వల్ల ప్రయాణం ఆలస్యమవ్వడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై...
ఈ సమస్యను అధిగమించేందుకు టోల్ ఫ్రీ ప్రయాణాన్ని హైదరాబాద్ - విజయవాడ హైవేపై అనుమతించాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. జనవరి 9వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతిస్తే ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలు వెళతాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో తెలిపారు.