Telangana : శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి : డీజీపీ

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు

Update: 2025-12-30 12:12 GMT

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలు కూడా శాంతి భద్రతలు కాపీ ఎలక్షన్స్ అన్ని నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు.

మొదటి స్థానంలో తెలంగాణ...
ట్రావెల్ సేఫ్ పేరుతో సీఐడీ నూతన యాప్ తీసుకొచ్చిందని.. మహిళలు, జర్నీ చేసే వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని సూచించారు. టూరిస్ట్ పోలీసులను ఈ ఏడాది లాంచ్ చేశామన్నారు. 80 మంది నియమించి.. టూరిస్ట్ ప్లేస్‌లో పోలీసులు ఎలా పని చేయాలనే దానిపై ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. డ్రగ్స్ కట్టడి కోసం ఈ ఏడాది ఈగల్ టీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.


Tags:    

Similar News