Telangana : జగిత్యాల ఛైర్మన్ ఎంపికపై ట్విస్ట్

జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పేరును పార్టీ అధినాయకత్వం సీల్డ్ కవర్ లో పంపింది

Update: 2026-02-16 04:28 GMT

జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పేరును పార్టీ అధినాయకత్వం సీల్డ్ కవర్ లో పంపింది. నిన్న ఇటు ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, అటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలతో నేతలు సమావేశమై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా సహకరించాలని కోరారు. అయితే ఏఐసీసీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నామని ఇద్దరూ ప్రకటించారు.

సీల్డ్ కవర్ లో పేరు...
జగిత్యాల మున్సిపాలిటీలో ఏ పార్టీకి సరైన వార్డులు దక్కేలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, జీవన్ రెడ్డి వర్గీయులు విడివిడిగా పోటీ చేయడంతో మెజారిటీ స్థానాలు ఎవరికీ దక్కలేదు. ఇద్దరు తమ కౌన్సిలర్లను క్యాంప్ లకు తరలించారు. అయితే సీల్డ్ కవర్ లో ఎవరి పేరు ఉందన్న దానిపై స్పష్టత లేదు. కవర్ తెరిస్తే కాని ఎవరి అభ్యర్థి ఛైర్మన్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News