ఏసీల వాడకంపై ప్రభుత్వం ఆదేశాలివే

ఏసీల వినియోగంపై ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది

Update: 2026-02-18 06:39 GMT

ఎండలు తీవ్రమవుతుండటంతో ఏసీల వినియోగంపై ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏసీల వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. రేపటి నుంచి వాతావరణం మరింత వేడెక్కుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ వాడకంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏసీలను 25 డిగ్రీల వద్దనే ఉపయోగించాలని కోరింది.

25 డిగ్రీల కంటే తక్కువగా...
అంత కంటే తక్కువ డిగ్రీల వద్ద ఏసీలను ఆన్ చేయవద్దని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ కండిషనర్లు 25 డిగ్రీల వద్దనే వాడాలని కోరారు. అంతకంటే తక్కువ డిగ్రీల్లో వాడానికి వీలు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మార్గదర్శకాల మేరకు వినియోగించాలని కోరింది.


Tags:    

Similar News