Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలకు చివరి అంకం

తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి అంకం ముగియనుంది.

Update: 2026-02-16 02:29 GMT

తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి అంకం ముగియనుంది. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీన జరిగిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి గెలుపొందిన వారు నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. మున్సిపాలిటీల్లో వార్డు మెంబర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు .అనంతరం కార్పొరేషన్ లలో మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు.

ఛైర్మన్, మేయర్ల ఎన్నిక...
మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంప్ లో ఉన్న తమ కార్పొరేటర్లు, వార్డు మెంబర్లను నేరుగా మున్సిపల్ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు అన్ని పార్టీలు చేపట్టాయి.


Tags:    

Similar News