Telangana : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గోవాకు మరింత వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎనభై కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ - పనాజీ కారిడార్ లో 80 కిలోమీటర్ల మేరకు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ అనుమతించింది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి గుడెబల్లూరు సెక్షన్ నాలుగు లేన్ల రోడ్లుగా నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలను వెల్లడించారు.
3,175 కోట్ల వ్యయంతో...
జాతీయ రహదారి 167 పరిధిలో ఈ ఎనభై కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి 3,175 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, రాయచూర్ వరకూ ఈ కనెక్టివిటీ లభించనుంది. ఈ నాలుగు లేన్ల రహదారి నిర్మాణం పూర్తయితే దాదాపు గంటన్నర సమయం హైదరాబాద నుంచి గోవాకు ఆదా కానుంది. దీంతో పాటు డీజిల్, పెట్రోలు ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి పర్యాటక ప్రాంతమైన గోవాకు అధిక సంఖ్యలో రహదారి మార్గాన వెళ్లేందుకు వీలు కలుగుతుంది.