ఐదు రోజులు వర్షాలే

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2023-09-12 03:48 GMT

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

ఉపరితల ఆవర్తనంతో...
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపింది. ఈ నెల 15వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని, ప్రధానంగా నిజామాబాద్, వికారాాద్, మంచిర్యాల, వికారాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాడ్  నగరంలోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
ఏపీలోనూ...
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Tags:    

Similar News