కింగ్ కోహ్లి బ్రాండింగ్ వాల్యూ తెలిస్తే షాక్ అవుతారు అంతే

Update: 2025-05-25 14:36 GMT

KingKohli

మైదానంలోనే కాదు బ్రాండింగ్ లో కూడా విరాట్ కోహ్లీ 'కింగ్' అనే నిరూపించుకున్నాడు. విరాట్‌ కోహ్లీ ప్రస్తుత బ్రాండింగ్‌ విలువ 1900 కోట్ల రూపాయలట. 2016 నుంచి 2023 వరకు ఎనిమిదేళ్లలో రెండు సార్లు మినహా ప్రతీ ఏటా కోహ్లీ బ్రాండింగ్‌ విలువ పరంగా భారత సెలబ్రిటీల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. బాలీవుడ్‌ స్టార్లు షారుఖ్‌ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌లకంటే కూడా కోహ్లీ విలువే ఎక్కువగా ఉందని పలు సంస్థలు తెలిపాయి.


ప్రస్తుతం కోహ్లి దాదాపు 30 ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. మరో 10 రకాల వ్యాపారాల్లో అతని భాగస్వామ్యం ఉంది. మార్కెట్‌ అంచనా ప్రకారం విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్రాండ్ ను బట్టి 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినా అతడి బ్రాండ్ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గదని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Tags:    

Similar News