T 20 World Cup : నేడు టీ20 వరల్డ్‌కప్‌లో నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్
నేడు టీ20 వరల్డ్‌కప్‌లో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది
నేడు టీ20 వరల్డ్‌కప్‌లో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఫైనల్స్ లో ఇరు జట్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. భారత్‌కు ఇది టీ20 వరల్డ్ కప్ లో నాలుగో ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మూడోసారి కప్పు కోసం టీమిండియా శ్రమిస్తుంది.
ఇరు జట్ల మధ్య...
తొలిసారి టీ20 వరల్డ్‌కప్ గెలవాలని పట్టుదలతో కివీస్ ఉంది. భారత్-న్యూజిలాండ్ తలపడిన టీ-20 మ్యాచ్‌లు 30 జరిగాయి. వీటిలో భారత్ 18 మ్యాచ్‌లలో గెలుపొందగా, న్యూజిలాండ్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇరు జట్లు బలంగానే ఉండటం, పోరాడి ఫైనల్స్ లో ప్రవేశించడంతో నేడు జరిగే తుదిపోరులో ఎవరిది గెలుపు అన్నది ఉత్కంఠగా మారింది.