మహిళల జట్టుకు డైమండ్ నెక్లెస్ లు

ప్రపంచ కప్ ను గెలిచిన మహిళ జట్టుకు అభినందనలు కొనసాగుతూనే ఉన్నాయి

Update: 2025-11-03 12:52 GMT

ప్రపంచ కప్ ను గెలిచిన మహిళ జట్టుకు అభినందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక వ్యాపార వేత్త డైమండ్ నెక్లెస్ లు ఇస్తామని ప్రకటించారు. తొలిసారిగా ప్రపంచ కప్ ను సాధించిన మహిళల జట్టుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు వారి నివాసాలకు సోలార్ ప్యానెల్స్ ను కూడా బహుమతిగా ఇస్తామని గోవింద్ ఢోలాకియా చెప్పారు.

ఫైనల్ మ్యాచ్ కు ముందే...
అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందే గోవింద్ ఢోలాకియా ఈ బహుమతిని ప్రకటించారు. ఈ పోటీలో టీం ఇండియా గెలిస్తే తాను వజ్రాల ఆభరణం ఇస్తామని, సోలార్ ప్యానెల్స్ ఇస్తామని చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారమే తాను త్వరలో వారికి ఈ బహుమతులను అందచేస్తానని గోవింద్ ఢోలాకియా తెలిపారు. వారు మన భారత దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేశారని గోవింద్ ఢోలాకియా ప్రశంసించారు.


Tags:    

Similar News