భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ తెలుగోడు.. నయా స్టార్

వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడిపోయినా.. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మపై

Update: 2023-08-04 05:30 GMT

వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడిపోయినా.. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. హైదరాబాదీ కుర్రాడు తిలక్ అరంగేట్రంలో అదరగొట్టాడు. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లో 2 సిక్స్‌లు బాదాడంటే అతడి కాన్ఫిడెన్స్ ను అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్.. తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 6వ ఓవర్లోని మూడో బంతిని 81 మీటర్ల సిక్స్ బాదాడు. ఆ తర్వాతి బంతిని కూడా సిక్సర్ కొట్టాడు. తొలి టీ20 మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు బాదాడు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌దే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం.

కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తిలక్ వర్మను ఆకాశానికి ఎత్తేశాడు. ‘తిలక్ తన ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ను రెండు సిక్సర్లతో ప్రారంభించడం చాలా గిప్ప విషయం. తిలక్ ఆత్మవిశ్వాసం, నిర్భయంగా షాట్లు ఆడే విధానం చూస్తే అతను ఎంతో దూరం వెళ్లనున్నాడు. టీమిండియాకు అతను అద్భుతాలు చేయబోతున్నాడు’ అని చెప్పాడు.
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 150 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేసిన 39 పరుగులే అత్యధికం. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వెస్టిండీస్ 1-0తో ముందంజ వేసింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 6న గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది.


Tags:    

Similar News