భారీ స్కోరు కాపాడుకోలేకపోయాం
మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. భారత బ్యాటర్లు రాణించి 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ఆసీస్ ఆటగాళ్లు భారీ స్కోరును ఊదేశారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతిక రావల్ మంచి పునాది వేశారు. అనంతరం వచ్చిన హర్లీన్ డియోల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వేగంగా ఆడటంతో భారత జట్టు 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ తర్వాత ఆష్లే గార్డనర్ 45 పరుగులు చేయగా, ఎల్లీస్ పెర్రీ 47 పరుగులు నాటౌట్ గా నిలిచి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది.