Asia Cup : ఆసియా కప్ లో భారత్ బలహీనత అదేనా? వీక్ నెస్ నుంచి బయటపడేదెలా?
ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీం ఇండియాకు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆల్ రౌండర్ల కొరత పట్టిపీడిస్తుంది
ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీం ఇండియాకు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆల్ రౌండర్ల కొరత పట్టిపీడిస్తుంది. ఆసియా కప్ ప్రారంభం కానున్ననేపథ్యంలో ఆల్ రౌండర్లు ఇద్దరే కనిపిస్తున్నారు. అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యాలు మాత్రమే ఉన్నారు. అందుకే మూడో ఆల్ రౌండర్ ఉంటే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. “మూడో ఆల్‌రౌండర్ లేకపోతే ఇబ్బంది తప్పదు” అని మహ్మద్ కైఫ్ చేసిన హెచ్చరికలు అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు మూడో ఆల్‌రౌండర్ లేకుండా ఆడితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని మహ్మద్ కైఫ్ చేసిన హెచ్చరికలు ఒకింత అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి.
ముగ్గురు ఆల్ రౌండర్లతో...
2024 టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు విజయం సాధించింది. అప్పట్లో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా అనే ముగ్గురు ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం వలన బ్యాటింగ్ ఆర్డర్ లో ఎనిమిదవ స్థానానికి బలంగా సాగింది, బౌలింగ్‌లోనూ ఆరు సరైన ఆప్షన్లు దొరికాయి. కానీ, ఆసియా కప్ 2025లో మాత్రం ఇద్దరు ఆల్‌రౌండర్లే ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మాత్రమే ఆల్ రౌండర్లు. దీంతో బ్యాటింగ్ విషయంలో కొంత టీం ఇండియా ఇబ్బందులు పడక తప్పదన్న హెచ్చరికలు ఒకింత జట్టు కూర్పులో లోపంగానే కనిపిస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ లేకపోవడం జట్టుకు లోటే అని కైఫ్ అన్నారు.
నేడు ఇద్దరే...
టీ20 ప్రపంచ కప్‌లో హార్దిక్, అక్షర్, జడేజా ముగ్గురూ సరైన సమయంలో అద్భుత ప్రదర్శన చేసి, జట్టుకు బ్యాటింగ్-బౌలింగ్ రెండింటిలోనూ అవసరమైన సహాకారన్ని అందించారు. అయితే ప్రపంచ కప్ తర్వాత జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లకు వీడ్కోలు చెప్పడంతో భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో బలహీనపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెలెక్టర్లు వాషింగ్టన్ సుందర్‌ను కేవలం స్టాండ్ బైగా మాత్రమే చేర్చడంతో మూడో ఆల్ రౌండర్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో 15 మంది జట్టులో ప్రధాన ఆల్‌రౌండర్లుగా హార్దిక్, అక్షర్ మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ లో ఒకరు విఫలమయినా మరొకరు ఉన్నారులే అన్న భరోసా కనిపించడం లేదు. దీంతో భారత్ జట్టు ఈ సమస్య నుంచి ఎలా అధిగమిస్తుందన్నది చూడాలి.
ఆసియా కప్ 2025 - భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకు సింగ్.