కొహ్లి చెప్పేది అవాస్తవం.. స్పందించిన బీసీసీఐ

కొహ్లి, బీసీసీఐలకు మధ్య వార్ ముదురుతున్నట్లుంది. నిన్న కొహ్లి చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ స్పందించింది.

Update: 2021-12-16 03:27 GMT

కొహ్లి, బీసీసీఐలకు మధ్య వార్ ముదురుతున్నట్లుంది. నిన్న కొహ్లి చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ స్పందించింది. టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కొహ్లి సెప్టంబరులో చెప్పారని, తాము అప్పుడే వద్దని సూచించామని బీసీసీఐ తెలిపింది. వన్డేలకు ఒకరు, టీ 20 లకు మరొకరు కెప్టెన్ గా ఉండటం సరికాదని కొహ్లికి సూచించామని పేర్కొంది.

గంట ముందు....
అయితే కొహ్లి మాత్రం వన్డే కెప్టెన్సీ తనను తప్పుకోమని గంట ముందు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపింది. వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటారని నేరుగా గంగూలీయే కొహ్లితో చెప్పారని తెలిపింది. కొహ్లి ఎందుకు ఇలా మాట్లాడారో తెలియదని పేర్కొంది.


Tags:    

Similar News