విరాట్ కోహ్లీ ఆస్తులు ఎంతంటే?

కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.110 కోట్లుగా మ్యాగ్‌జైన్ ప్రచురించింది. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్‌లో రూ.80 కోట్ల విలువైన

Update: 2023-06-19 05:35 GMT

టీమిండియా మాజీ సారథి 'విరాట్ కోహ్లీ' ఆస్తుల గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కోహ్లీ సంపాదనలోనూ అందరికంటే ముందున్నాడు. విరాట్ కోహ్లీ సంపాదనకు సంబందించిన వివరాలను ఓ మ్యాగ్‌జైన్ తన కవర్ పేజీమీద ప్రచురించింది. ఆ లెక్కల ప్రకారం కోహ్లీ నికర ఆదాయం రూ.1050 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థాయిలో నికర ఆస్తి కలిగిన ఏకైక ఆటగాడు ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమేనని ఆ సంస్థ పేర్కొంది. 34 యేళ్ల కోహ్లీ.. బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో 'ఏ' గ్రేడ్‌లో ఉన్నారు. ఆయనకు సంవత్సరానికి రూ.7 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నారు. ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు చొప్పున మ్యాచ్ ఫీజ్ అందుకుంటున్నారు. ఐపీఎల్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించినందుకు రూ.15 కోట్లు ప్రతి ఏడాది కోహ్లీ అందుకుంటూ ఉన్నాడు. వాణిజ్య ప్రకటనలు, పలు బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉన్నందుకు భారీ మొత్తంలో నగదు అందుకుంటున్నారు. ఇలా 18కి పైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీకి యేడాదికి రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేరకు సంపాదిస్తున్నాడు.

కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.110 కోట్లుగా మ్యాగ్‌జైన్ ప్రచురించింది. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్‌లో రూ.80 కోట్ల విలువైన మరో ఇల్లు ఉన్నట్లు తెలిపింది. కోహ్లీ తన ఇన్‌స్టా ఖాతాలో ఒక్క వ్యాపార ప్రకటనను షేర్ చేసేందుకు రూ.8.9 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. అదే ట్విటర్‌లో రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు. కోహ్లీ వ్యాపార ప్రకటనల ద్వారాఎక్కువ మొత్తం ఆర్జిస్తున్నాడు. రోజుకు రూ.7 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్‌ఎస్‌బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్‌ఆర్‌ఎప్, సింథాల్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
కోహ్లీకి సొంతంగా రెండు రెస్టారెంట్స్(One 8, Nueva) ఉన్నాయి. ఇవి కాకుండా ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్‌ల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఎమ్‌పీఎల్, డిజిట్, కాన్వో, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, బ్లూట్రైబ్ వంటి కంపెనీల్లో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. కోహ్లీ వద్ద ఉన్న కార్ల విలువ రూ.30 కోట్ల పైమాటే. ఆడి, రేంజ్ రోవర్, ఫార్చూనర్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లున్నాయి. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ పేరిట పేద విద్యార్థులు, క్రికెటర్లకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నాడు.


Tags:    

Similar News