కోహ్లీ డ్రెస్ గురించే చర్చ

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఎప్పుడెప్పుడా

Update: 2023-10-14 11:25 GMT

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పోరు మొదలైంది. స్టార్ ఇండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ తన ప్రపంచ కప్ అరంగేట్రం చేసాడు. అయితే విరాట్ కోహ్లీ డ్రెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. మ్యాచ్ ప్రారంభంలో భారత మాజీ కెప్టెన్ తప్పుడు ఇండియా జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చాడు. భారత అఫీషియల్‌ జెర్సీకి బదులు వేరే జెర్సీతో బరిలోకి దిగాడు. భుజాలపై మూడు రంగుల అడ్డగీతలు కలిగిన జెర్సీని కాకుండా వైట్‌ స్ట్రైప్స్‌ కలిగిన జెర్సీని ధరించి స్టేడియంలోకి ఎంటరయ్యాడు. అదే జెర్సీతో జాతీయ గీతం ఆలపించే సమయంలోనూ.. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక కూడా కాసేపు అదే జెర్సీతో కొనసాగాడు.

ఈ విషయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీకి చెప్పగానే.. దానిని గమనించాడు కోహ్లీ. సరైనదాన్ని తీసుకురావాలని బెంచ్‌పై ఉన్న తన సహచరులను కోరాడు. ప్రపంచ కప్‌లో టీమిండియా ఆటగాళ్లు త్రివర్ణ చారలు ఉన్న జెర్సీని ధరించారు. సరైన జెర్సీ తెచ్చిన వెంటనే విరాట్ కోహ్లి కొంత సేపటికి మైదానం వెలుపలికి వెళ్లి దానిని మార్చుకున్నాడు. ఇషాన్ కిషన్ కొంత సమయం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు.


Tags:    

Similar News