IPL 2025 : విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్ .. అందుకే సామీ నువ్వు కొట్టాలయ్యా కప్పు

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కూడా కోహ్లి తన దైన ఇన్నింగ్స్ ఆడాడు

Update: 2025-04-25 02:12 GMT

ఐపీఎల్ సీజన్ 18లో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఎంత అభిమానులున్నారంటే అందుకు విరాట్ కోహ్లి అని ఎవరైనా చెబుతారు. ఐపీఎల్ లోనే కాదు కోహ్లి ఆటలో ఉంటే చాలు స్టేడియంలో నినాదాలతో పాటు నిలబడి ఆడితే చాలు స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. కోహ్లి అయితే త్వరగా అవుటవుతాడు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా హాఫ్ సెంచరీ ఖచ్చితంగా చేస్తాడన్న పేరుంది. అందుకే కోహ్లి నిలకడగా ఆడకుండా ప్రత్యర్థులు త్వరగా అవుట్ చేయాలని చూస్తారు. ఏదో ఒక బంతితో మ్యాజిక్ చేసి కోహ్లిని అవుట్ చేస్తే యాభై పరుగులు తక్కువ చేసినట్లే అని అనుకుంటారు.

సూపర్ ఇన్నింగ్స్...
నిన్న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కూడా కోహ్లి తన దైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి ఎప్పుడూ నింపాదిగా ఆడతాడు. అవసరమైనప్పుడు మాత్రమే షాట్ కొడతాడు. ఎక్కువగా సింగిల్స్, డబుల్ రన్స్ తీయడానికే ఎక్కువ గా ప్రయత్నిస్తాడు. బంతి బ్యాట్ కు అందివచ్చినట్లు అనిపిస్తే చాలు వెనువెంటనే బంతిని బౌండరీకి తరలిస్తాడు. లేదంటే అలవోకగా సిక్సర్ కొడతాడు. అందుకే కోహ్లి ఆటకు చాలా మంది ఫిదా అవుతారు. పరుగుల మెషిన్ గా పేరు. అలసట లేని కోహ్లి పరుగులు చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది.
అదనపు పరుగుుల జోడించడం...
ఎన్ని సింగిల్స్ చేసినా ఏ మాత్రం అలుపు రాదు. ఒక పరుగు తీయాల్సిన చోట రెండు పరుగులు చేసి జట్టుకు మరిన్ని పరుగులను జోడించడం కోహ్లికి అలవాటు. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లి 70 పరుగులు చేశాడు. కోహ్లి సూపర్ ఫామ్ లో ఉంటే ఎవరూ ఆపలేరు. జట్టుకు వెన్నుముకగా నిలుస్తాడు. కోహ్లి ఉన్నాడంటే అదొక ధైర్యం. జట్టుకు మాత్రమే కాదు.. ఆ జట్టు అభిమానులకు కూడా భరోసా ఇచ్చేది కోహ్లి మాత్రమే. కోహ్లి తన 70 పరుగులలో ఫోర్లు, సిక్సర్లు అధికంగా లేకపోయినా ఎక్కువగా సింగిల్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే కోహ్లి నువ్వు సూపర్ అంటూ అభిమానులు తెగ పొగడ్తలు కురిపిస్తుంటారు. విరాట్ విశ్వరూపం చూసిన వారికి ఎవరికైనా ఇదే అనిపించకమానదు. అందుకే నువ్వు కొట్టాలయ్యా కప్పు అంటూ చిన్న స్వామి స్టేడియంలో అభిమానులు నినదించారు.


Tags:    

Similar News