Ind Vs Eng Third Test : ఊగిసలాడుతున్న గెలుపు .. ఆధిపత్యం కోసం శ్రమిస్తున్న ఇరు జట్లు
ఇండియా - ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ జరుగుతున్న మూడో టెస్ట్ లో రెండు జట్లు గట్టిగా తలపడుతున్నాయి.
ఇండియా - ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ జరుగుతున్న మూడో టెస్ట్ లో రెండు జట్లు గట్టిగా తలపడుతున్నాయి. గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అయితే చివరకు ఎవరిది గెలుపు అవుతుందన్నది తెలియకున్నా ప్రదర్శన తీరు మాత్రం ఇరు జట్లది అద్భుతమనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో పై చేయి సాధించేందుకు ఇండియా - ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడుతుండటంతో గెలుపునకు కూడా ఎటు వైపు మొగ్గాలో తెలియని పరిస్థితి నెలకొందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీ చేశాడు. 104 పరుగులు సాధించాడు. జేమ్ స్మిత్ 51 పరుగులు చేశాడు, బ్రైడన్ కార్స్ 56 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్ జస్పిత్ బూమ్రా ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును నిలువరించగలిగాడు.
387 పరుగులకు ఇంగ్లండ్ ఆల్ అవుట్...
మొత్తం 387 పరుగులకు ఇంగ్లండ్ కు భారత్ ఆల్ అవుట్ చేయగలిగింది. ఇక భారత్ కూడా మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్ 53 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. పంత్ కూడా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి జైశ్వాల్ 13 పరుగులకే అవుటయి వెనుదిరిగాడు. ఇక రెండు టెస్ట్ లలో సెంచరీలతో మోత మోగించిన భుభమన్ గిల్ పదహారు పరుగులకే అవుట్ కావడంతో భారత్ కొంత కష్టాల్లో పడినట్లు కనిపించింది. తొలి రెండు టెస్ట్ లలో విఫలమయిన కరుణ్ నాయర్ 40 పరుగులు చేసి దూకుడుగా ఆడి అవుటయినా పరవాలేదనిపించాడు. ఆ తర్వాత మాత్రం ఇంగ్లీష్ బౌలర్లకు రాహుల్, పంత్ లు ఇద్దరూ అవకాశమివ్వకుండా పరుగులను చేస్తుండటంతో కొంత మెరుగైన ఆట తీరును కనపర్చిందనే చెప్పాలి.
రెండో రోజు సంతృప్తికరంగా...
రెండో రోజు సంతృప్తికరంగా ఆడినప్పటికీ ఈ రోజు భారత్ ఆటతీరుపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రోజు భారత్ కు ఎంతో కీలకమనే చెప్పాలి. ఈరోజంతా కేఎల్ రాహుల్, పంత్ లు నిలబడి స్కోరు ను పెంచుతూ పోతే తప్ప ఆధిక్యత సాధ్యం కాదు. ఉదయం పూట లార్డ్స్ మైదానం పేసర్లకు అనుకూలంగా మారుతుంది. అది తప్పించుకుంటే భారత్ అపజయం నుంచి బయటపడే అవకాశాలున్నాయి. మరి ఈ రోజు ఏం జరుగుతుందన్నది ఆటలో ఆసక్తికరంగా మారింది. ఈరోజు దాదాపు మూడు వందలకు పైగా పరుగులు సాధించగలిగితేనే భారత్ పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్ాననాయి. కానీ అది ఎంత వరకూ సాధ్యమన్నది మాత్రం చూడాల్సి ఉంది.