IPL 2025 : నేడు సండే డబుల్ ధమాకా
ఈరోజు ఐపీఎల్ లో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది.మరో మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కోల్ కత్తా నైడ్ రైడర్స్ ఢీకొంటున్నాయి
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పుడు జరిగే మ్యాచ్ లు అన్నీ నామామత్రమే. ఎందుకంటే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుకు నాలుగు జట్లు చేరుకోవడంతో ఇక జరిగే మ్యాచ్ లపై ఆసక్తి లేకపోయినా, గెలుపోటములపై ఛాంపియన్స్ ట్రోఫీపై పెద్దగా ప్రభావం చూపవని తెలుసు. అందుకే ఈ మ్యాచ్ లను చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే వరసగా ప్లే ఆఫ్ రేసుకు చేరిన జట్లను ఇప్పటికే ట్రోఫీ నుంచి నిష్క్రమించిన జట్లు ఓడిస్తున్నప్పటికీ అదో తుత్తి అనుకోవాల్సిందే తప్ప మరేరకమైన ప్రయోజనం లేదు.
నేడు రెండు మ్యాచ్ లు...
ఈరోజు ఐపీఎల్ లో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక మరో మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో కోల్ కత్తా నైడ్ రైడర్స్ ఢీకొంటున్నాయి. రాత్రి ఏడున్నర గంటలకు ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే తొలి మ్యాచ్ లో గుజారాత్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మరింతగా రాణిస్తుంది. ఇక రెండో మ్యాచ్ లో ఎవరు గెలిచినా లాభం లేదు. అందుకే ఈ మ్యాచ్ లు ప్లేఆఫ్ కు వచ్చే వరకూ కొంత అనాసక్తిగానే ఉండనున్నాయి.